Followers

కోవిడ్ పై అవగాహన తరగతులు నిర్వహించాలి

 కోవిడ్ పై అవగాహన తరగతులు నిర్వహించాలి

సాలూరు, పెన్ పవర్

పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ కళాశాలలో ప్రతి రోజు కోవిడ్ పై అవగాహన కల్పించే విధంగా విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాలు మేరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేయుడమైనది అని పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధిన్ తెలిపారు. కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పట్టణ ఎస్.ఐ.ఫకృద్ధిన్ ఆయా పాఠశాలల, కళాశాలల సిబ్బందికి సూచించారు. పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు తమపోలీసు సిబ్బంది తో కలసి వెళ్లి పాఠశాలలు మరియు కళాశాలలు యొక్క యాజమాన్యాలతో శుక్రవారం సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ విద్యార్థిని మరియు విద్యార్థులు అందరికి కరోన వైరస్ గూర్చి అవగాహన తరగతులు నిర్వహించి తీసుకోవాలిసిన జాగ్రత్తలు గూర్చి వారికి వివరించి వారిని చైతన్యపరచాలని, అలాగే సిబ్బంది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ తగినంత సామాజిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కు సూచించడం మైనది. ప్రతి ఒక్కరూ హ్యాండ్ వాష్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...