నూతన పంచాంగం డైరీ ఆవిష్కరణ
మందమర్రి, పెన్ పవర్
మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానంలో శుక్రవారం శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర పంచాంగం, డైరీ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా బి. సంజీవ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా జిఎం ఎం సురేష్ లు హాజరై నూతన పంచాంగం, డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి అచి వెంకటరమణచార్య, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment