Followers

నాడు నేడు తో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి

 నాడు నేడు తో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి      


 పెన్ పవర్, కందుకూరు

నాడు నేడు పథకం లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి జరుగుతుందని కొండేపి ప్రాజెక్టు సిడిపిఓ విజయ కుమారి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు, మహిళా పోలీసులు, తల్లుల కమిటీతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయ కుమారి మాట్లాడుతూ కందుకూరు మండలం లో పందలపాడు, మాచవరం, దొండపాడు, ఓగూరు అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు మంజూరు అయినట్లు తెలిపారు. పాత భవనాలకు మౌలిక సదుపాయాలతో పాటు నూతన భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అంగనవాడి కేంద్రాల నిర్మాణాలు నాణ్యతగా త్వరితగతిన పూర్తిచేయాలని నిర్మాణ బాధ్యతలు  తల్లుల కమిటీ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు యు.ప్రభావతి, ఎల్. విజయ, ఎం ఎస్ కె లు, అంగన్వాడి కార్యకర్తలు, తల్లులు కమిటీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...