ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
మోతుగూడెం,పెన్ పవర్
చింతూరు మండలం మోతుగూడెంలో ఎపి జెన్కో ఎస్సీ ఎస్టీ వెల్పెర్ అసోసియేషన్ కార్యాలయం నందు సోమవారం ఉదయం బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినా ఎపి జెన్కో సీలేరు కాప్లెంక్స్ చిప్ ఇంజనీరింగ్ గౌరిపతి ముందుగా జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల,పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అలాగే ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఇప్పటి తరం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిఇ వెంకటరత్నం, వేమగిరి కిరణ్, శైలజ మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment