Followers

పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్ధిక భరోసా జగనన్న విద్యా దీవెన

 పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్ధిక భరోసా జగనన్న విద్యా దీవెన

పెన్ పవర్, రావులపాలెం

ఆర్ధిక సమస్యల కారణంగా ఏ పేద విద్యార్థి ఉన్నత చదువుకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పధకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారని శాసనసభ్యులు చిర్ల అన్నారు. రావులపాలెంలోని శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని మన ప్రభుత్వం 4 విడతలుగా అందిస్తుందని, విద్యార్థుల పూర్తి ఫీజు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ పధకం మొదటి విడతలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 6166 మంది విద్యార్థులకు 3 కోట్ల 92 లక్షల 73 వేల 7 వందల 37 రూపాయలు వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని విద్యార్థులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.గత ప్రభుత్వం 1880 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రేయింబర్స్మెంట్ బకాయిలు పెడితే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని తీర్చి, విద్యార్థులకు విద్యా దీవెన పధకం సక్రమంగా అందేలా చూస్తుందని తెలియచేసారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన పధకం మొదటివిడతలో భాగంగా సుమారు 10 లక్షల 88 వేల మంది విద్యార్థులకు 671.45 కోట్ల రూపాయలు అందిస్తుంది అని విద్యార్థుల ఉన్నత చదువుకు చేయూత ఇవ్వడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియచేసారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...