అగ్ని ప్రమాదానికి గురైన బాదితురాలిని పరామర్శించిన... జడ్పిటిసి చారులత రాథోడ్
ఉట్నూర్, పెన్ పవర్ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన గజ ఈతగాడు కొండ్ర పోషన్న భార్య కొండ్ర లక్ష్మి ఇటివలే వంట చేస్తుండగా అకస్మాత్తుగా ఫిడ్స్ వచ్చి పోయ్యి వద్ద మంటల్లో పడి అగ్ని ప్రమాదానికి గురైంది. శరీరం పూర్తిగా కాలడంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించగా మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడా కొద్ది రోజులుగా వైద్యం పొందుతున్న క్రమంలో ఆరోగ్యం క్షిణిస్తున్నదని హైదరాబాద్ కి రెఫర్ చేయాలని వైద్యులు చెప్పడంతో వారు తగిన ఆర్థిక స్థోమత లేక నిరుపెద స్థితిలో ఉన్నందున ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడలోని తమ స్వగృహానికి వెళ్ళారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ జడ్పిటిసి చారులత రాథోడ్ శనివారం బోయవాడలోని వారి స్వగృహానికి వెళ్ళి లక్ష్మిని పరామర్శించారు.లక్ష్మి ఆరోగ్య వివరాలను భర్త పోషన్నను అడిగి తెలుసుకున్నారు. వారి దీనమైన పరిస్థితులను గమనించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళాలని జడ్పిటిసి చారులత రాథోడ్ వారికి కొంత ఆర్థిక సహయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి చారులత రాథోడ్ మాట్లాడుతు ఉట్నూర్ మండలమే కాకుండా ఆయా ఇతర మండలాలలోని బావుల్లో చెరువుల్లో పడ్డ వారిని గజ ఈతగాడిగా కొండ్ర పోషన్న ఎందరికో ఎనలేని సేవలను అందించాడని, నేడు ఆయన భార్య లక్ష్మి అనారోగ్యంతో చావు బతుకుల మద్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వారికి ధైర్యం కల్పించి మెరుగైన వైద్యం కోసం తగిన సహయాన్ని అందించడం జరిగిందని, ఈ విషయంపై మానవతావాదులు ఆపదలో ఉన్న కొండ్ర లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం తోచినంతగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.
No comments:
Post a Comment