Followers

సీ ఎం ఆర్ ‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ..

 సీ ఎం ఆర్ ‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. 



కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే కే పి వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 57 మందికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.22.68 లక్షల విలువ గల చెక్కులను చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటూ, ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక మంది సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా లబ్ధి పొందుతున్నారని, ప్రభుత్వం ద్వారా ఎల్వోసీ కూడా అందించడంతో ఎంతో మంది బాధితుల ప్రాణాలు నిలుస్తున్నాయని అన్నారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన నియోజకవర్గ ప్రజలు సీఎంఆర్‌ఎఫ్‌ పథకంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...