ఉచిత మాస్కులు, మజ్జిగ, మంచినీరు పంపిణీ
కూకట్ పల్లి, పెన్ పవర్
డాక్టర్ రావుస్ ఇ.ఎన్.టి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జీవిఎస్ రావు ఆధ్వర్యంలో ఉచితంగా లక్ష మాస్కులు పంపిణీ కార్యక్రమని నగరంలో పలుచోట్ల నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా జీవిఎస్ రావు మాట్లాడుతూ కరోన వైరస్ భయంకరమైన రూపాంతరం చెంది ప్రాణాలు హరిస్తుందని, భారతదేశం ఇప్పుడు రెండో స్థానంలో ఉందని, 136కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో కరోన నుండి కాపాడుకోడానికి ఏకైక సాధనం మాస్కు మాత్రమేనని అన్నారు. ఇంతకుముందు కరోన తుమ్మడం, దగ్గడం వల్ల వ్యాప్తి చెందేదని ఇప్పుడు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతునట్లు పరిశోధనలు రుజువుచేస్తున్నాయని, కాబట్టి ప్రతి వ్యక్తి మాస్కు ధరించాలని, ఒంట్లో నలతగా ఉన్న పక్షంలో కుటుంబ సభ్యులకు, మిత్రులకు, చుట్టుపక్కల వారికి దూరంగా ఉంటూ కరోన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మాస్కుల పంపిణితో పాటు ఎండాకాలని దృష్టిలో పెట్టుకొని మినరల్ వాటర్ బాటిల్స్, మజ్జిగ సైతం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కరోన పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం రాకుండా మెలగాలని కోరారు.
No comments:
Post a Comment