కోవిడ్ కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన
కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్మూలనకు సహకరించాలి
జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి ఎస్.సత్యనారాయణ
పాచిపెంట, పెన్ పవర్
కరోనా నియంత్రణ సామాజిక బాధ్యతగా అందరు భావించాలని జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. కోవిడ్ ప్రత్యేక అధికారి ఎస్.సత్యనారాయణ జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్, ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విదెహ ఖరె పాచిపెంట, సీతనగరం మండలాల్లో కోవిడ్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం పరిశీలన గావించారు. అందులో భాగంగా పాచిపెంట మండలం పి.కొనవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, సీతానగరం జోగెమ్మపేట ప్రతిభా కళాశాలలో కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రత్యేక అధికారి తెలిపారు, అంతే కాకుండా గరుగుబిల్లి మండలం ఉద్యానవన కళాశాలలో కూడా కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డును కోవిడ్ పత్యేక అధికారి పరిశీలించారు. కరోనా నిర్మూలనకు మాస్క్ ధరించడం , సామాజిక దూరం,పలుమార్లు చేతులు శుభ్రం చేసుకోనేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ పరిశీలనా కార్యక్రమానికి జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి ఎస్.సత్యనారాయణ, ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విదెహ ఖరె, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకటేశ్వర రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెడెంట్ డాక్టర్ వాగ్దేవి, డిప్యూటీ డి ఎం.అండ్ హెచ్.ఓ డాక్టర్ రవికుమార్ రెడ్డి,మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment