ఐఎన్ నగర్ గుట్టపై మెట్లు ఏర్పాటు
పెన్ పవర్, మల్కాజిగిరిగౌతంనగర్ డివిజన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాల మేరకు ఐఎన్ నగర్ గుట్టపై నివాసిస్తున్న ప్రజలకు మెట్ల మార్గం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కార్పోరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాట్లాడుతూ గుట్టపై నివాసిస్తున్న వారికి ఎన్నో ఎళ్లుగా సరియైన మెట్లు మార్గంలేక ఇబ్బందులు ఎదురుకున్నారని ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరం చేశారని, నూతనంగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గం పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాము యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment