ఆక్రమణలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది
కూకట్ పల్లి, పెన్ పవర్
కూకట్ పల్లి కే.పీ.హెచ్.బి కాలనీ రోడ్డు నెంబర్ ఒకటిలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలంలో చాలాకాలంగా గుడిసెలు వేసుకుని అందులో నివాసం ఉంటున్న వారిని జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం ఖాళీ చేయించారు. గుడిసెల్లో నివాసం ఉంటున్నవారు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అధికారులు ఆకస్మికంగా ఇల్లు ఖాళీ చేయమనడంతో ఆగ్రహించిన ప్రజలు ఇళ్లపై ఎక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి పంపే క్రమంలో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో వాటిని తొలిగించిన్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment