పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన
పాఠశాలల్లో పారిశుధ్యపనులు సక్రమంగా నిర్వహిస్తూ టాయిలెట్స్, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈఓ కె.బుల్లి కృష్ణవేణి అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం, ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు,ఆయాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజూ మూడు సార్లు టాయిలెట్లు శుభ్రం చేయించాలన్నారు.టాయిలెట్ వద్ద సానిటైజర్, సబ్బు అందుబాటులోఉంచాలన్నారు. విద్యార్థులతో ఆయాలు మంచిగా ప్రవర్తించి, సత్సంబంధాలు ఏర్పచుకోవాలి. ప్రతిపాఠశాలకు ఆరురకాల రసాయనాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు . ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు పారిశుధ్య పనులు నిర్వహణపై శ్రద్ధ పెట్టి,ఆయాలతో సక్రమంగా చేయించాలని ఎందుఓ కృష్ణవేణి సూచనలు చేశారు. ఆర్పీలు కె.భారతి, వీఆర్యప్రసాదరావు, టీవీ సాగర్, పీవీ రమణమూర్తిలు పారిశుధ్యపనులు నిర్వహణ గురించి వివరించి,ఆయాలకు, కమిటీసభ్యులకు, హెచ్ఎంలకు అవగాహన కల్పించారు.
No comments:
Post a Comment