విద్యాసంస్థలను పునఃప్రారంభిచాలి
--విద్యార్థి జన సమితి
మందమర్రి, పెన్ పవర్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పేరుతో అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోని, అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిచాలని విద్యార్థి జన సమితి జిల్లా కో కన్వీనర్ బచ్చలి ప్రవీణ్ డిమాండ్ చేశారు. శనివారం మందమర్రి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు విద్యాసంస్థలు ప్రారంభించి, ఎన్నికలు ముగిసిన తర్వాత కరోనా ను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు,మద్యం షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, దేవాలయాల పై ప్రభావం చూపని కరోనా పాఠశాలలపై చూపెడుతుందా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు చేసి ఉపాధ్యాయులను పట్టించుకోవడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రత్యేక భృతి కల్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల ద్వారా ఆదాయం రావడం లేదని మూసివేశారని, విద్యాసంస్థలను ఆర్థిక వనరుల కాకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విజేఎస్ ఆద్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ శివ కుమార్, రవిచరణ్, కే సమ్మయ్య, తేజ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment