Followers

సింగరేణిలో కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలి

 సింగరేణిలో కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలి

టీఎన్టీయూసీ డిమాండ్

బెల్లంపల్లి, పెన్ పవర్.

బెల్లంపల్లి సింగరేణి లోనూ కరోనా మహమ్మారి వణికిస్తున్న తరుణంలో,రక్షణ చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మనిరామ్ సింగ్ అన్నారు. ఎండలు పెరుగుతున్న కారణంగా కరోనా కూడా విజృంభిస్తుందని, కావున సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ ఇతర డిపార్ట్మెంట్లలో  పని చేస్తున్న కార్మికులకు వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటైజర్ లు మాస్కులు ఉచితంగా కార్మికులకు ఇవ్వాలని అన్నారు. కరోనా వైరస్ కార్మికులకు వ్యాధి వ్యాపించి నట్లయితే జాతీయ విపత్తు చట్టం 1897 డు ప్రకారంగా సింగరేణిలో కార్మికులకు వేతనాలు కట్టి ఇవ్వాలని అలాగే బస్తీలలో కార్మికుల కాలనీలలో రాపిడ్ టెస్టులు కార్మికుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి కరోనా బారిన పడకుండా పరీక్షలు నిర్వహించి బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాణాలను ప్రాణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులకు కరోనా బారినపడి చనిపోయినట్లు అయితే గని ప్రమాదంగా గుర్తించాలని కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని లేనిపక్షంలో సింగరేణిలో వెంటనే లాక్ డౌన్ విధించాలని అన్నారు. సింగరేణి లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి కూడా కరోనా బారిన పడి చనిపోయినట్లు అయితే వారికి కూడా కోటి రూపాయల చెల్లించాలని, సింగరేణి హాస్పటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి నర్సులకు వార్డ్ వార్డు బాయ్ లకు ప్రతి ఒక్కరికి 10 శాతం రీసెంట్ చెల్లించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు అమానుల్లాఖాన్, దుర్గం రాజయ్య, మల్లయ్య, రియాజ్, తలారి రాజు, సుధాకర్,అశోక్, భూపతి,లు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...