అట్టడగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్
విజయనగరం,పెన్ పవర్
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు భారత ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏప్రిల్ 5, సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపిఎస్., ముఖ్య అతిధిగా హాజరై, బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలను సమర్పించి ఘనంగా నివాళు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - జగజ్జీవన్ రామ్ భారత స్వాతంత్ర్యయ ఉద్యమంలో బ్రిటిష్ వావారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. మహాత్మా గాంధీ పిలుపునందుకొని స్వాతంత్ర్యయాన్ని సాధించేందుకు క్విట్ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలల్లో చురుకుగా పాల్గొని, జైలుకు వెళ్ళారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన భారత ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, రక్షణ మరియు వ్యవసాయ శాఖామంత్రిగా, ఉప ప్రధానిగా సుదీర్ఘ కాలం పని చేసారన్నారు. దేశంలో అంటరాని తనాన్ని రూపు మాపేందుకు, అట్టడుగు ప్రజల అభ్యున్నతికి, వ్యవసాయ రంగం లో అభివృద్ధికి, హరిత విప్లవాన్ని సాధించేందుకు, దళితులకు ఓటు హక్కును కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసారన్నారు. భారత దేశానికి ఉప ప్రధానిగా పని చేసిన మహానీయున్ని జయంతిని జరుపుకోవడం, స్మరించుకోవడం, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యతన్నారు. అటువంటి మహానీయున్ని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, డిసిఆర్ బి సిఐబి.వెంకటరావు, ఎస్ బి సిఐ శ్రీనివాసరావు, ఆఱలు చిరంజీవిరావు, ఈశ్వరావు, పి.ఎం. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, డిపిఒ సిబ్బంది పాల్గొని, బాబూ జగజ్జీవన్ రామ్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
No comments:
Post a Comment