Followers

స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటాం...

 స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటాం...

మహారాణి పేట, పెన్ పవర్

18వ రోజు దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు ముఖ్యవ్యక్తిగా దీక్షలో పాల్గొన్న జివియంసి కాంట్రాక్ట్ వర్కర్స్ పూలమాల వేసి ప్రారంభించారు.కోటేశ్వరరావు మాట్లాడతూ స్టీల్ ప్లాంట్ను రక్షించుకుంటాం.ఇప్పటికే నగరంలో సున్న అఖిలపక్ష కార్మిక విద్యార్ధి యువజన,మహిళా, మేధావులు అందరూ ఒకమాట మీదకు వచ్చి పోరాడుతున్నాము. దీనికి రాష్ట్రం,దేశంలో ఉన్న ప్రజాసంఘాలు,మేథావులు,రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేసి మనతో పాటు పోరాటంలో పాల్గొంటున్నారు.ఇంతటి ఐక్యత సాధించటంతోనే స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం.అనే నమ్మకం కలుగుతుంది. స్టీల్ ప్లాంట్ పైన అనేకమైన అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాలు అన్నింటిని అక్కడ ఉన్న కార్మికవర్గం ఎదుర్కొంటుంది.స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాలలో నడుస్తున్నది. ఇనుపఖనిజ గనులు లేకపోయిన లాభాలలో నడుస్తుంది. గనులు ఉంటే ఇంకా అత్యంత లాభాలతో నడుచును.కాని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే గనులు కేటాయించటం లేదు. ఏ పరిశ్రమ లేని వారికి గనులు కేటాయించారు. ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు స్టీల్ ప్లాంట్ అమ్మడం కోసం ప్రయత్నం ప్రధానం చేసింది.ఇది దేశంలో ప్రజానీకానికి అద్దవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 7.3మిలియన్లు టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 32వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంది. అదే పోస్కో స్టీల్ ప్లాంట్ 40.0 మిలిమన్లల టన్నులు ఉత్పత్తి చేస్తూ 4వేల మందికి మాత్రమే ఉద్యోగులతో పని చేయించుకుంటున్నారు. మన ప్లాంట్ గాని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే ఉన్న ఉద్యోగాలు పోవడంతో పాటు కొత్తగా మన ముందు తరాలకు ఉపాధి వుండదు. అందుకే మనం దేశభక్తితో పోరాడుతున్నాము. ఈ రోజు దీక్షల్లో జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జివియంసి ఫెడరేషన్ పి. వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.చైర్మన్ ఎం.జగ్గునాయుడు,వైస్ చైర్మన్ పి.రమణ,సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ కెఎస్వి కుమార్,బి. జగన్,జివియంసి యూనియన్ నాయకులు ఎం.ప్రసాద్,సూకరాజు,యు.రాజు,అప్పలరాజు, జి.అప్పారావు,ఆదినారాయణ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...