Followers

టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు సంక్షేమంపై వివక్ష

 టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు సంక్షేమంపై వివక్ష

మందమర్రి పెన్ పవర్

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మహిళలను సంక్షేమం పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ మందమర్రి పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని ఆరోపించారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ డ్వాక్రా మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చకుండా, ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం పై చూపెడుతున్న వివక్షపై పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పట్టణంలోని 24 వార్డులో వార్డు, పట్టణ కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాల పై పోరాటం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అయినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఎండగడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇన్చార్జ్ ఉపేందర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుల్ల కోళ్ల అనూష, మహిళ నాయకురాలు నగునూరి రాధ, టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజాహిద్, మండల  పార్టీ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సంతోష్ గౌడ్, నాయకులు రవి, పిండి ఐలయ్య, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...