Followers

విమ్స్ ను కోవిడ్ సెంటర్ గా ప్రారంభించాలి

 విమ్స్ ను  కోవిడ్  సెంటర్ గా ప్రారంభించాలి 

మహారాణి పేట, పెన్ పవర్

కరోనా రెండవ దశ  విజృంభిస్తున్న  వేళ విశాఖ ప్రజలకు పూర్తిస్థాయిలో  వైద్య సదుపాయాలు కలిగిన  విమ్స్ ని కోవిడ్ సెంటర్ గా  వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని   రవి కుమార్ కోరారు.విశాఖలో రోజు రోజుకి కొవిడ్ సోకిన రోగులు సంఖ్య పెరుగుతున్నది అని కేజీహెచ్ లో  500 పడకలు నిండిపోయిన్నాయి అని విశాఖ చెస్ట్ ఆస్పత్రి లో పడకలన్నీ పూర్తిగా నిండి పోయాయి అని తెలియజేశారు.కార్పొరేట్ ఆస్పత్రులలో కోవిడ్ పేరుతోటి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని ,ప్రభుత్వ యంత్రాంగం చోద్యము చూస్తున్నదని అన్నారు.కోవిడ్ ను  ప్రభుత్వము ఆరోగ్యశ్రీ లోకి చేర్చిన కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ల దందా మారలేదు అని ,ఈ విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందారని అన్నారు. ప్రధాని మోడీ చొరవతో 30 కోట్ల డోసులు కోవిడ్ వ్యాక్సిన్ ముడిసరుకు రెడీగా ఉందని అతి తొందరలో భారతావని అంతటా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు కొవిడ్  నియంత్రణకు  వ్యాక్సిన్తో పాటు,తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ,భౌతిక దూరం పాటించాలని ,చేతులను తరచుగా పరిశుభ్రంగా  చేసుకోవాలని కోరారు.విశాఖలోని అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన విమ్స్ ను పూర్తి స్థాయిలో అనగా డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ ,పారిశుద్ధ్య పని వారు,ఎమ్.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ,యుద్ధ ప్రాతిపదిక మీద నియమించి వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.గత ఆరు నెలలుగా నెలసరి వేతనం  అందని వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య పని వారు లకు వెంటనే వేతనములు చెల్లించాలని  కోరారు.వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజలలో ఉన్న అపోహలు తొలగించడానికి ప్రచార సాధనములను ఉపయోగించుకోవాలని కోరారు.ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడినది అని, విశాఖలో ఇప్పటి వరకు 4,30,931 మందికి వ్యాక్సిన్ వేయటం జరిగినది అని,అనతి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పూర్తిస్థాయిలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు.అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము ఈ వ్యాక్సిన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేబట్టి ,ఆంధ్రప్రదేశ్ ను కరోనా రహిత  రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.ఇజ్రాయిల్ దేశం లో మాదిరిగా భారతావనిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీకా వేయించుకొని మన ఆరోగ్యంతో పాటు,ఇతరుల ఆరోగ్యం కూడా కాపాడాలని సూచించారు.కోవిడ్ కష్టకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ప్రతి వారికి డబ్బు కోసము ఇబ్బంది పడకుండా భారత ప్రధాని నరేంద్రమోడీ కరోనాకవచ్ పేరుతో అతి తక్కువ ప్రీమియం తో  50 వేల నుంచి 5 లక్షల వరకు 105 రోజులు ,195 రోజులు,285 రోజుల కాల వ్యవధి గల పాలసీలు తీసుకోవాలని సూచించారు.40 సంవత్సరాల నుంచి 50సంవత్సరాల వరకు  రూపాయలు 3,50,000 కు ప్రీమియం ఖరీదు  461 రూపాయలు,50 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రీమియం ఖరీదు   615  రూపాయలు ,అన్ని ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఈ పాలసీలు లభ్యం అవుతాయి .ప్రజలందరూ ముందు జాగ్రత్త కోసం, కరోనాకవచ్ పాలసీలు తీసుకోవాలని మరియు అశ్రద్ధ చేయవద్దని ప్రజలకు సూచించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...