గురజనాపల్లి హైస్కూలు ఉపాధ్యాయుడు వితరణ
పెన్ పవర్, కరప
మండలంలోని గురజనాపల్లి పబ్బినీడి పాపారావు జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్న సాంఘికశాస్త్రం. ఉపాధ్యాయుడు ఐ.ప్రసాదరావు వితరణతో తరగతి గదులకు గోడ గడియారాలు సమకూరాయి. గురజనాపల్లి హైస్కూలులో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఉపాధ్యాయుడు ప్రసాదరావు 10 గోడ గడియారాలు కొనుగోలు చేసి శుక్రవారం హెచ్ఎం ఎం.ప్రసాదరావుకు విరాళంగా అందజేశారు. తరగతి గదులతో పాటు హెచ్ఎం, స్టాఫ్ రూము కూడా గడియారాలను విరాళంగా ఇచ్చినందుకు హెచ్ఎం ప్రసాదరావు, సహ ఉపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు సమయపాలన పాటించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈగడియారాలు ఇచ్చినట్టు ఉపాధ్యాయుడు ఐ.ప్రసాదరావు అన్నారు. ఉపాధ్యాయులు వీవీ రమణమూర్తి, అర్జునరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment