ప్రైవేట్ ఉపాధ్యాయులకు సర్కార్ భరోసా
మండల తహసీల్దార్ రాజ్ కుమార్
లక్షెట్టిపెట్, పెన్ పవర్రాష్టంలోని అన్ని విద్యాసంస్థలు మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలలో విద్యను బోధించే ఉపాద్యాయులు అర్ధాకాలితో బాధపడుతున్న విషయం గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని మండల తహసీల్దార్ రాజు కుమార్ అన్నారు.గురువారం పట్టణంలోని రేషన్ దుకాణాల వద్ద ప్రైవేట్ ఉపాధ్యాయులకు 25కిలోల సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని మండల విద్యాధికారి రవీందర్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మానవీయ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్టంలోని ప్రైవేట్ పాఠశాల లోని సిబ్బందికి 25 కిలోల సన్న బియ్యంతో పాటు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం హర్షణీయం దగ్గర విషయమని తెలిపారు.దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అర్ధాకలితో అలమటిస్తున్న ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా నాయకులు చంద్రశేఖర్, వై,శ్రీనివాస్ తో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment