జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఎల్లారెడ్డిపేట విశ్వ బ్రాహ్మణులను ఆత్మీయంగా పలకరించడానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ అధ్యక్షుడు చందనగిరి గోపాల స్వామి. ఎల్లారెడ్డిపేట మండలం లోని పలు గ్రామాల అధ్యక్షులు రాచర్ల బొప్పాపూర్ లో గల బ్రహ్మంగారి దేవాలయంలో సభను ఏర్పాటు చేయగా సభకు విచ్చేసిన చందనగిరి గోపాలస్వామి ని శాలువా కప్పి పలు గ్రామాల అధ్యక్షులు మండల అధ్యక్షుడు చెలిమెలి అంజనేయులు చారి జిల్లా కోశాధికారి దుమాల శంకర్ చారి మండల ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ చారి కోశాధికారి కాంబోజి దేవరాజు చారి ప్రచార కార్యదర్శి శ్రీరాముజు దేవరాజు చారి రాజు చారి శ్రీధర్ ఆచారి వంగాల నాగభూషణం చారి మండో జు రాజయ్య చారి వంగాల శ్రీనివాస చారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు సభ్యులు శాలువా కప్పి సన్మానించడం గా చందనగిరి గోపాల స్వామి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా భుజస్కంధాలపై బాధ్యతను ఉంచిన మీ బాధ్యతలను ఎల్లవేళలా విశ్వబ్రాహ్మణుల కై పోరాడుతానని విశ్వబ్రాహ్మణులు నిరుపేదలు ఉన్నారని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఉన్నాయని విశ్వ బ్రాహ్మణులందరికీ వృత్తి లేబర్ కార్డు ఇప్పిస్తాననిమన జిల్లాలో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణుని కి ఐడెంటి కార్డు చేయించి ఇస్తానని విశ్వబ్రాహ్మణులకు అన్ని వేళలా ఆపదలో నైనా స్పందిస్తానని మనమందరం ఐక్యమత్యంగా ఉంటేనే మన మన విలువలు ప్రభుత్వానికి తెలుస్తాయని ప్రభుత్వం దగ్గర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడే వరకు పోరాడుతానని ఆయన అన్నారు.
No comments:
Post a Comment