Followers

సెయింట్ సావియో పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.

 సెయింట్ సావియో పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.

ఆపత్కాల సాయం జాబితాలో పేరు చేర్చకుండా మోసం.

 టీచర్లు కాని వారిని జాబితాలో చేర్చారు.

బాధితుడు జీవన్ కుమార్ ఆరోపణ

తొర్రూరు , పెన్ పవర్

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ను ఆదుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంకై జాబితా రూపకల్పనలో స్థానిక సెయింట్ సేవియో పాఠశాల తనకు మొండిచేయి చూపిందని సదరు పాఠశాల టీచర్ జీవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.సోమవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తన ఆవేదనను మీడియాకు వెల్లిబుచ్చాడు.ఈ సందర్భంగా జీవన్ కుమార్ మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థలు మూతపడటంతో ప్రత్యామ్నాయ ఉపాధి కరువైన తనలాంటి టీచర్లను ఆదుకునేందుకు ప్రతి నెలా రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు వారి కుటుంబాలకు ప్రతి నెలా 25 కిలోల సన్నబియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందుకు యూడైస్‌ నమోదును ప్రాతిపదిక తీసుకుందన్నారు.   కాగా తాను గత కొన్నేళ్లుగా పట్టణంలోని సెయింట్ సేవియో పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నానని తెలిపారు.  బోధనా అనుభవం, అన్ని రకాల విద్యార్హతలు కలిగిన తన పేరును సదరు పాఠశాల యూ డైస్ లో నమోదు చేయలేదన్నారు. పాఠశాల నుంచి ఎంపికైన 17 మంది ఉపాధ్యాయుల జాబితాలో ఉన్నత తరగతులకు బోధించే తన పేరు లేకపోవడం శోచనీయమన్నారు.అర్హత ఉన్న తనను కాదని,పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులను,  ఉపాధ్యాయులు కాని వారిని ఆపత్కాల సాయం జాబితాలో చేర్చారన్నారు. పాఠశాల వ్యవహారంతో ఈ కరోనా విపత్కర వేళ రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం పొందే అవకాశాన్ని కోల్పోయానన్నారు. విద్యా సంస్థలోని హాజరు పట్టికల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది పేర్లతో పాటు వారికి వేతనంగా చెల్లించిన అక్విడెన్స్‌ల నివేదిక సమర్పణ పూర్తిగా తప్పుల తడకగా సమర్పించారని,  తనకు అనుమానం ఉందన్నారు.విద్యాశాఖ అమలు చేస్తున్న యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యూకేషన్‌ (యూడైస్‌) లో  పాఠశాలలో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల జాబితాను సెయింట్ సేవియో పాఠశాల సమగ్రంగా సమర్పించ లేదని, అర్హత లేనివారికి పేర్లను యూడైస్ లో నమోదు చేశారని, ఆరోపించారు. పాఠశాలల యాజమాన్యం కొద్దిమందినే ఉపాధ్యాయులుగా చూపడం సరికాదన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేయని వారే ఎక్కువ మంది విధుల్లో కొనసాగుతున్నారన్నారు. విపత్కర ఆర్థిక సాయం అందుతున్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు  హాజరుపట్టికల ఆధారంగా ఆర్థిక సాయం, రేషన్‌ బియ్యం అందుతాయని ఆశపడ్డారన్నారు. సెయింట్ సావియో పాఠశాల వ్యవహారంపై విచారణ జరిపి, సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. తొలి విడతలో నమోదైన వారికే..ఎంఈఓ గుగులోతు రాము మొదటి విడతలో ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తూ యూడైస్‌లో నమోదైన వారికి మాత్రమే ప్రతి నెలా రూ. 2 వేల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇప్పటికే సమగ్ర వివరాలు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదించాం. నిబంధనల ప్రకారం యూడైస్‌నే ప్రామాణికంగా తీసుకున్నాం.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...