Followers

కరోనా పట్ల అందరూ జాగ్రత్తలు పాటించాలి

 కరోనా పట్ల అందరూ జాగ్రత్తలు పాటించాలి

వైద్య అధికారి  డాక్టర్ రవి

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్నగూడూరు మండల కేంద్రంలోని శనివారం నాడు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజున కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ... ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఆదివారం మరియు సెలవు దినాలలో కూడా కరోనా టీకా వేస్తారని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా అందరూ వేసుకోవాలిఅన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు అయినా వారు తప్పనిసరిగా వాక్సిన్  తీసుకోవాలని కోరారు. అందరూ భౌతిక దూరం శానిటైజర్ మాస్కులు రోగ నిరోధక శక్తిని పించే ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్నారు . ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, స్టాప్ నర్స్ నసీమ, ఏఎన్ఎం నర్సు బాయి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, ఆశజ్యోతి పాల్గొన్నారు.

.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...