నగర మేయర్ కు తిరుపతి లడ్డు ప్రసాదం.
పెన్ పవర్, కాప్రాజిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాప్రా సర్కిల్ పర్యటనలో భాగంగా మేయర్ హోదాలో మొదటిసారి డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాప్రా మాజీ కార్పొరేటర్, కుషాయిగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొత్త రామారావు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జ్ఞాపికను, తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కొత్త రామారావు మాట్లాడుతూ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మహానగరం మరింత అభివృద్ధి చెందాలని దేశంలోనే మొదటి స్థానంలో గుర్తింపు తెచ్చుకోవాలని తలపెట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment