Followers

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్వీ

 సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్వీ 

తార్నాక , పెన్ పవర్ 

నూతన జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన సందర్బంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్ పిలువు మేరకు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ లో  టీఆర్ఎస్వీ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రవణ్ రెడ్డి  మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు చిగుళ్ల మహేందర్  ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్ధి నేతలు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 7 జోన్లు 2 మల్టీ జోన్ల విధానం వర్తిస్తుంది.. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లు ముందస్తుగా గా ఏకకాలంలో 50వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి మార్గం సుముఖం అవటంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ, ఉద్యోగ వర్గాల్లో ఉజ్వల భవిష్యత్తు దిశగా ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొలువుల జాతర త్వరలోనే మొదలవుతుందని  ఆకాంక్షిస్తూ.. ఇందుకోసం అహర్నిశలు కృషిచేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ టీఆర్ఎస్వీ  పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు హమాలీ శ్రీనివాస్ , శీతల విజయ్ , పీఆర్ ప్రవీణ్ , దయాకర్ రెడ్డి , సానాల రవి , శ్రీకాంత్ , రామ్ సాయి , రఘువరన్ , పవన్ పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...