రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం
👉ఫ్యాక్టరీ యజమానులు స్పందించాలి
👉రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది
👉టమోటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పరిశ్రమలు సహకరించాలి
👉 రానున్న పది రోజుల్లో మరింత ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నందున క్రషింగ్ ప్రారంభించాలి
చిత్తూరు, పెన్ పవర్
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పడమటి ప్రాంతాలలో టమోటా ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా భావించిందని ఫ్యాక్టరీ యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గుజ్జు పరిశ్రమల యజమానులు మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు ఉద్యానవన శాఖ అధికారులతో టమోటా ధరలపై జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలు సుమారు 6,800 హెక్టార్లలో టమోటా పంటను సాగు చేస్తున్నారని ఈ రోజు 600 మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి మార్కెట్లోకి వస్తున్నదని ఇందులో ప్రధానంగా మదనపల్లె మార్కెట్ కు మూడు వందల మెట్రిక్ టన్నుల వస్తుండగా పుంగనూరు పలమనేరు కలికిరి గుర్రంకొండ ములకలచెరువు ప్రాంతాలలోని మార్కెట్లకు మిగిలిన టమోటా ఉత్పత్తులు రావడం జరుగుతున్నాయని అయితే ఇతర రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున ఉత్పత్తి ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలగకుండా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందుకోసం మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మరి కొన్ని రోజుల పాటు టమోటా గుజ్జు తయారు చేయాలని అలా చేయడం ద్వారా రైతులకు కొంతవరకైనా గిట్టుబాటు ధర కల్పించినట్లు అవుతుందని అన్నారు. దీనికి సంబంధించి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు తరఫున గోవర్ధన్ బాబీ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 45 పరిశ్రమలు ఈ సీజన్లో మామిడి గుజ్జును తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం అన్ని యంత్రాలను ఓవర్ ఆయిలింగ్ చేసుకుంటున్నారని ఇప్పటికే 1.25 లక్షల మెట్రిక్ టన్నుల టమోటాను కొనుగోలు చేసి గుర్తుగా తయారు చేయడం జరిగిందని ఇప్పటికే మామిడి పళ్ళు విజయవాడ ప్రాంతం నుంచి రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ యజమానులు అందరూ రైతులు కాబట్టి రైతుల సమస్యలు తెలుసు కోవడంతో పాటు వారికి కూడా తమ వంతు పాత్ర గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా గుజ్జు పరిశ్రమలో పెద్దవి 10 ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇందులో లో ఒక లైన్ టమోటా గుజ్జు తయారు చేసేందుకు అందరినీ ఒప్పించడం చేయాలని ఫ్యాక్టరీ యజమానులు కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటంవల్ల వారితో చర్చించి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ నిర్ణయానికి సహకరిస్తామని అన్నారు. మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ఉత్పత్తులు అవ్వడం వల్ల మరియు కరోనా పరిస్థితులవల్ల ఇతర ప్రాంతాలకు పోలేని పరిస్థితులు రావడం జరిగిందని అయితే ఇతర ప్రాంతాల్లో కూడా టమోటాలు భారీగా ఉత్పత్తి కావడంతో అక్కడ కూడా ధరల పతనం అయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇప్పటికే కొంత వరకు కొనుగోలు ప్రారంభించి రైతు బజారు కు పంపడం జరిగిందని అయితే ఉత్పత్తులు ఎక్కువగా ఉండడంతో ఫ్యాక్టరీ యజమానులు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గుజ్జు పరిశ్రమల యజమానులు మరి కొందరు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యజమానులతో చర్చించి శనివారం సాయంత్రం లోపు నిర్ణయం తీసుకొని సోమవారం నుంచి టమోటా గుజ్జు తయారు చేసేందుకు పరిశ్రమలను సిద్ధం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దమయంతి పరిశ్రమల యజమానులు,మార్కెటింగ్, ఉద్యనవనశాఖ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment