మూగజీవాలకు,ప్యక్ష్యాదులకు సంరక్షించడం మన అందరి బాధ్యత
రాజమహేంద్రవరం,పెన్ పవర్
రాజమహేంద్రవరంలో స్థానిక లలితానగర్ లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు లలిత నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నామాల ధనరాజు జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యులు అందించిన నీటి తొట్టెలను శనివారం ఉదయం పంతం కొండలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పంతం మాట్లాడుతూ వేసవి కాలం లో నీళ్లు లేక మూగజీవాలు అల్లాడుతున్నాయి అని, ఆహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ధనరాజు ఆయన కుమారుడు నామాల వాసు ప్రతి ఏటా జరుగుతున్న ప్రక్రియ లో భాగంగా 50 నీటి కుండీలను అందించేందుకు ఆయన ముందుకు రావడం గర్వకారణం అని ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో పలు ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నామని పంతం తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంచుమర్తి చంటి,ఇసుకపల్లి శీను, లలిత నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ,లవ కేశవరావు, గంటా సునీల్ ,పంతం శ్రీనివాస్ ,పేరా బత్తుల శ్రీనివాస్, నండూరి సుబ్బారావు,ఏడిద వెంకటేష్ ,పడాల శ్రీను,కేబుల్ ఆపరేటర్లు డి.టి రాజు సుందరినిడి శ్రీను,సి.సి.సి ఛానల్ మేనేజర్ వంకా రాజేంద్ర, ఆదిత్య కళాశాల ఎన్ ఎన్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి.ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment