Followers

కమ్యూనిటీ సీసీ కెమెరాలకు స్వచ్చందంగా విరాళాలు

కమ్యూనిటీ సీసీ కెమెరాలకు స్వచ్చందంగా విరాళాలు

మరింత భద్రత కోసం వ్యాపారస్తులు రూ1.55 లక్షలు విరాళాం అందజేత



పెన్ పవర్, మల్కాజిగిరి

నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్యూనిటీ సిసికెమెరాల ఏర్పాట్లకు స్వచ్చందంగా వ్యాపారస్తులు విరాళాలు నేరేడ్మట్ సిఐ నర్సింహ్మ స్వామికి అందజేశారు. డిఫెన్స్ కాలనీ వద్ద ఆర్.కె. శర్మ జి.కె.కాలనీ క్యాటార్స్, కల్పాన స్టీల్స్, ఎఫ్ 3 కాఫీ యాజమన్యులు, ఫీప్ట్ అవెన్యూ బేకరి వ్యాపారస్తులు నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వచ్చందంగా విరాళం అందజేశారు. ఈ సందర్బంగా నేరేడ్మట్ సిఐ. నర్సింహ్మ స్వామి మాట్లాడుతూ నేరేడ్మట్ లో నేరాల సంఖ్య పూర్తిగా తగ్గిందని, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 24గంటల పాటు ప్రాంతల్లో జరిగే అన్ని విషయాలను ఈ నిఘా కెమెరాలు రికార్డు చేస్తాయని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రజలు సురక్షితంగా ఉండవచ్చని, ఏదైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను సులభంగా పట్టుకోవచ్చని, ఒక్క సిసికెమెరా 100 మంది పోలీసుల రక్షణతో సమానం అన్ని అన్నారు. వ్యాపారస్తులు పోలీసులకు సహకరిస్తూ కమ్యూనిటీ సీసీకెమెరాలకు స్వచ్చందంగా విరాళాం అందించినందుకు వారిని ఆభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, చెన్నరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...