కరోనా కట్టడికి పాక్షిక లాక్ డౌన్
గంభీరావుపేట, పెన్ పవర్
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపెట గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ సర్పంచ్ చెట్టి మహేశ్వరీ 18-4-2021 నుండి 25-4-2021 వరకు మల్లరెడ్డిపేట గ్రామం లో పాక్షిక లాక్ డౌన్ విధించడం మైనది. మల్లారెడ్డిపెట ప్రజలకు కరోనా మహమ్మారి బాగా బాధితుల సంఖ్య పెరుగుతుండటం తో నిర్ణయం తీసుకోవడం మైనది. గరిష్ట సమయపాలన ను అమలు లోకి తీసుకొని వచ్చారు. మల్లారెడ్డి పెట గ్రామం లో కిరాణం వ్యాపారస్తులు ఉదయం 6.00" నుండి 10. 00 వరకు మరియు సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00వరకు తెరచి ఉంచాలి లావాదేవీలు ఉపయోగించు కోవాలి. మాస్కులు ధరించి సామజిక దూరం పాటించాలి తెలిపారు. హోటల్ , టిఫిన్ సెంటర్లు కేవలం పార్సల్ మాత్రమే ఇవ్వాలి సిటింగ్ అనుమతి లేదు హాస్పిటల్ , మెడికల్ షాప్ లు పాల విక్రయ కేంద్రాలకు ఎలాంటి ఆంక్షలు వర్తించవు యధావిధిగా నడుస్తాయి.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించని యెడల 1000/- రూపాయల జరిమానా విధించబడును. బీడీ కార్ఖానా కు వెళ్లే వాళ్ళు సామజిక దూరం పాటిస్తూ మీటర్ దూరం లో ఉండాలి మాస్క్ లు ధరిస్తూ తమ విధులు కొనసాగించు కోవాలి. తీర్థయాత్ర లు వెళ్లే భక్తులు తమ ప్రయాణలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. తెలిపారు. ఇప్పటికై ఎవరైనా తీర్థయాత్ర వెళ్లిన వారు ఉంటే 45 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా ఉంటే గంభీరావుపేట సామజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిజన్ తీసుకోవాలని, కరోనా వ్యాక్సిన్ పూర్తి ఉచితంగా నే ఇవ్వబడును అని తెలిపారు. ఎప్పటి కప్పుడు కోవిడ్ -19 పాక్షిక లాక్ డౌన్ పై ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకో బడును అని తెలిపారు. దయచేసి ప్రతి ఒక్కరు పై సూచనలు ఖచ్చితంగా పాటించాలి అన్నారు. కార్యక్రమం లో మల్లా రెడ్డిపేట చెట్టి మహేశ్వరీ గంభీరావుపేట మండల మార్కెట్ కమిటీ చేర్మెన్ సుతారి బాలవ్వ , ఉపసర్పంచ్ గ్రామ ప్రజలు పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment