Followers

విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

 విద్యార్థుల భవిష్యత్తు కొరకు వెంటనే పాఠశాలలను ప్రారంభించాలి,, ట్రస్మా

కేసముద్రం,  పెన్ పవర్ 

గురువారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) డివిజన్ అధ్యక్షులు యాకాంతం గౌడ్, కేసముద్రం మండల అధ్యక్షులు జోగు డాంగయ్య లు విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ట్రస్మా రాష్ట్ర, జిల్లా శాఖల ఆదేశానుసారం నిర్వహించే 12 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో మొదటిరోజు పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉదయం కేసముద్రం మండల ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో వాకర్లకు "బార్లలో లేని కరోన - బడులలో ఉందా", "విద్యార్థుల భవిష్యత్తు కై బడులను తెరవండి", "ప్రైవేటు ఉపాధ్యాయులను కాపాడండి" వంటి ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్, డాంగయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి  పునరాలోచించి విద్యార్థుల విద్యా స్థాయి ప్రమాణాలు లోపించకుండా పాఠశాలలను పునః ప్రారంభించాలని అన్నారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న బార్లు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, లాంటి  వాటికి అనుమతిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలలను మూసివేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కరోనాతో ప్రాణనష్టం జరగలేదని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలలను వెంటనే తెరిపించాలని అన్నారు. పాఠశాలలు మూతపడటంవల్ల ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే భోధన, బోధనేతర సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం బాధ్యులు మోడెం రవీందర్ గౌడ్, సట్ల కర్ణాకర్, సమ్మయ్య, కేసముద్రం మండల ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు గాజుల రవి, ప్రధాన కార్యదర్శి కూన శ్రీను, నల్ల కిరణ్, ప్రైవేటు ఉపాధ్యాయులు శోభన్ బాబు, నరేష్, కేసముద్రం వాకర్స్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...