మాజీ మంత్రి చందులాల్ చిత్రపటానికీ నివాళులు అర్పించిన సీనియర్ జర్నలిస్ట్
పెద్దగూడూరు , పెన్ పవర్ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుటుంబ సభ్యులను మహుబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బీరవెల్లి మహేష్ పరామర్శించారు. మొదటగా చందూలాల్ చిత్రపటానికీ పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చందూలాల్ తో మహేష్ కు ఉన్న అనుబంధాన్నీ గుర్తు చేసుకుని, ఆవేధన వ్యక్తం చేశారు. చందూలాల్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని నష్టమని అన్నారు. చందూలాల్ని నమ్ముకుని ఉన్న ఆయన అభిమానులను కంటికి రెప్పల చూసుకునే భాధ్యత ఆయన కుమారుడు ప్రహ్లాద్ పైనే ఉందని, మనో ధైర్యం చేసుకోవాలనీ ప్రహ్లాద్ ను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద్ స్నేహితుడు జర్నలిస్టు బీరవెల్లి శ్రీధర్ పాల్గోన్నారు.
No comments:
Post a Comment