Followers

గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్

 గ్రంథాలయ చైర్మన్  రౌతు   మనోహర్

బేలా, పెన్ పవర్

 ఆటల పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మనోహర్ అన్నారు. గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న మండలంలోని చెప్రాల గ్రామంలో  కబడ్డీ పోటీల గురువారంతో ముగిసాయి. ఈ పోటీలలో మొదటి బహుమతి తలై గూడ, రెండో బహుమతి రాంపూర్ గ్రామాల జట్టు గెలుపొందాయి. వీరికి జిల్లా గ్రంథాలయ చైర్మన్, గ్రామ టిఆర్ఎస్ నాయకులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ఆటల పోటీలలో గ్రామస్తులు గ్రామ యువకులు రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ యువకులు ఉద్యోగుల కోసం అనేక క్రికెట్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటి చైర్మన్ సంతోష్, టిఆర్ఎస్ నాయకులు సతీష్, గ్రామ  సంఘాల యువ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...