ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి...వినవయ్యా!
ది పరీక్షలు వాయిదా వేయాలని అయ్యన్న డిమాండ్
ఉపాద్యాయ సంఘాలు మౌనం వీడాలి
నర్సీపట్నం, పెన్ పవర్
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాననడం దారుణమైన అంశంగా మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. విలేకరులకు పంపిన వీడియోలో అయ్యన్నపాత్రుడు పలు అంశాలను ప్రస్తావించారు. ఒకప్రక్క కరోనా మహమ్మారి విజృంబిస్తూ ప్రజలను బలి తీసుకుంటుంటే, చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పోలీసులు, ఉపాధ్యాయులు వీరంతా కలిసి సుమారు 40 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుందని వివరించారు. కరోనా వల్ల అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు, తిరుపతి సభను వాయిదా వేసిన ముఖ్యమంత్రి, మొండిగా పరీక్షలు పెట్టేందుకు ముందుకు వెళ్లడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి కరోనాకు భయపడి ప్యాలెస్ లో ఉండి అన్ని పనులు చేసుకుంటారు, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని ఆగ్రహించారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేస్తే, ఇక్కడ ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో ఎవరైనా కరోనా బారినపడి మరణిస్తే, ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో బలమైన ఉపాద్యాయ సంఘాలు ఉన్నాయని, టిడిపి ప్రభుత్వంలో చిన్న పొరపాట్లకు పెద్ద ఉద్యమాలు చేశారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు నోరు విప్పడంలేదో అర్ధం కావడంలేదన్నారు. ఎంతోమంది ఉపాద్యాయులు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారని, ఇప్పటికైనా మౌనం వీడాలని పిలుపునిచ్చారు. ఉపాద్యాయ సంఘాలు ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు సూచించారు.
No comments:
Post a Comment