Followers

ఏజెన్సీలో పలుచోట్ల భారీ వడగళ్ల వర్షం

ఏజెన్సీలో  పలుచోట్ల భారీ వడగళ్ల  వర్షం
పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం
 ఏజెన్సీలో పలుచోట్ల భారీగా వడగండ్ల వర్షం కురుస్తోంది సోమవారం అరకు చింతపల్లి కొయ్యూరు పెదబయలు ముంచంగిపుట్టు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నా హఠాత్తుగా మబ్బులు వేసి కుండపోత వర్షం కురిసింది. వడగళ్ళు భారీగా పడడంతో  ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  వడగళ్ళు కారణంగా జీడిమామిడి పంటలు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలు తీవ్రత మండిపోతున్నాయి. వారంఎ రోజులుగా ఏజెన్సీలో సాయంత్రం  వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాత్రిపూట చల్లగా ఉన్నప్పటికీ పగలు ఎండలు తీవ్రంగానే కాస్తున్నాయి. వర్షాల కారణంగా వాతావరణం  చల్ల పడుతుందని అంటున్నారు.  అకాల వర్షాల కారణంగా  అడపాదడపా పిడుగులు కూడా పడుతున్నాయి. జీకే వీధి మండలం లో పిడుగు పడి ఏడు పశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. పలు చోట్ల చెట్లు కూడా ధ్వంసమవుతున్న. పర్యాటక కేంద్రమైన అరకులో ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో పర్యాటకులకు అంతరాయం కలిగింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...