Followers

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన... ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న

 అభివృద్ధి పనులను పర్యవేక్షించిన... ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 

ఆదిలాబాద్ , పెన్ పవర్

ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పర్యవేక్షించారు.అందులో భాగంగానే పట్టణం లోనికి ప్రవేశించే ప్రధాన మార్గంలో నిర్మిస్తున్న ఆర్చ్ (కమాన్) నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు నిర్మాణ పనులు పూర్తయిన ఆర్చ్ గేటు నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చురుగ్గా కొనసాగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ సుందరీకరణ లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమీషనర్ శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఆర్ అండ్ బీ, పురపాలక అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...