మానవ సేవే మాధవసేవ
పెన్ పవర్, ఆలమూరు
మానవ సేవే మాధవసేవని భగవంతుడు ప్రతి జీవిలోనూ దాగి ఉన్నాడని వారికి సేవ చేయడమే మానవులుగా మన ముందున్న కర్తవ్యమని ఆలమూరు మండలం జొన్నాడ రెడ్డి సంఘం సభ్యులు అన్నారు. స్థానిక జాతీయ రహదారి వద్ద గల ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరంతర మజ్జిగ చలివేంద్రాన్ని జొన్నాడ రెడ్డి సంఘం ప్రధాన అధ్యక్షుడు తాడి శ్రీనివాస రెడ్డి, (మందులషాపు శ్రీను) ప్రారంభించారు. వేసవి కాలం అన్నిరోజులు జాతీయ రహదారిపై వెళ్లే పాదచారులకు, వాహనదారులకు నిరంతరాయంగా చల్లటి మజ్జిగను అందజేయనున్నట్లు రెడ్డి సంఘం సభ్యులు తెలిపారు. మొదటిరోజు మజ్జిగ చలివేంద్రం నిర్వహణకు దాతగా నాండ్ర రామకృష్ణారెడ్డి మజ్జిగను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో జొన్నాడ ఉపసర్పంచ్ నాండ్ర నాగమోహన్రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు తాడి తమ్మిరెడ్డి, ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ద్వారంపూడి ఇంద్రారెడ్డి పలువురు పెద్దలతో పాటు సర్పంచ్ కట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment