Followers

స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవద్దు..

 స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవద్దు..

మహారాణి పేట, పెన్ పవర్

శ్రీ  గాయత్రి వెల్ఫేర్ కల్చరల్  యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం  ఆవరణలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు,తామర పత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి 96వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రథమ మహిళలకు  వేద పండితులు  పూర్ణకుంభ స్వాగతం పలికారు.ముందుగా వారు విశాలాక్షి చిత్రపటానికి  జ్యోతి వెలిగించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం ప్రాణ త్యాగము చేసి ,జైలు శిక్ష అనుభవించిన సమరయోధుల త్యాగాలను మరువరాదని అన్నారు.ప్రతి మహిళ విశాలాక్షి లాగా చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకొని దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నేటి సమాజంలో మహిళలు వ్యాపార ,రాజకీయ , ఉద్యోగ రంగాలలో ఎనలేని సేవలు అందిస్తున్నారని  దేశాలు పాలిస్తున్నారు  అన్నారు.45 సంవత్సరాలు దాటిన ప్రతివారు టీకా వేసుకొని కరోనా వ్యాధి ని కట్టడి చేయాలని కోరారు.గొలగాని శ్రీనివాస్ ప్రసంగిస్తూ నేటి యువత జాతినేతలు అడుగుజాడలలో నడవాలని కోరారు.యువనేత ద్రోణంరాజు శ్రీ వాత్సవ్ ప్రసంగిస్తూ విశాఖ అభివృద్ధికి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విశాలాక్షి  కుటుంబంతో మా కుటుంబానికి  మంచి అనుబంధం ఉన్నదని స్వాతంత్ర సముపార్జనలో విశాలాక్షి  చేసిన కృషిని విశాఖ ప్రజలు మరచిపోలేరు వారి ఆశీస్సులు ఎల్లవేళల మనకు ఉంటాయి అని అన్నారు.29వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి. నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వయోవృద్ధులకు అందేలాగా వార్డ్ లోని పారిశుద్ధ్య పనులను  పర్యవేక్షించి వార్డ్ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్  ఎస్.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీలక్ష్మి ,ఎస్.మహేష్ , జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల.రవికుమార్, ఎస్.చాతుర్య,పల్లా చలపతిరావు,చుక్కాకుల రాంబాబు,పల్లా లక్ష్మీ ,డాక్టర్ వై లక్ష్మణరావు,గేదెల శ్రీహరి,నగర వీధి విక్రయదారులు  డి.బాలాజీ, ఎమ్.నరేష్ , కె.శ్రీకాంత్,ఎమ్.మోహన్,ఎన్.శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని నగర ప్రధమ మహిళా దంపతులకు  శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...