కాప్రా సర్కిల్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఏవి ?
నాచారం , మల్లాపూర్ డివిజన్ లో అక్రమ నిర్మాణాల జోరు
అక్రమ నిర్మాణాలకు అండగా ఏసిపి ఖుద్దూస్
తార్నాక, పెన్ పవర్అక్రమ నిర్మాణాలకు కాదేది అడ్డు అన్నట్లు గా మారింది మల్లాపూర్ డివిజన్ పరిస్థితి. డివిజన్ లో ఎక్కడ చుసిన అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తాయి. అక్రమ నిర్మాణాలు సహించేది లేదని, అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చడం తథ్యం అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, కొత్త మున్సిపల్ చట్టం బుట్టదాఖలు అయ్యాయి. మల్లాపూర్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఆగడం లేదు. మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్, సూర్య నగర్, భవాని నగర్ తో పాటు పలు కాలనీలలో , అక్రమ షెడ్డుల నిర్మాణం, సెల్లర్ తో పాటు బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాలు యదేచ్ఛగా నిర్మిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా వాణిజ్య పరంగా ఉండే షెడ్డులు నిర్మాణాలు చేపట్టిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూడక పోవడం ఫై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిర్మాణదారుల వద్ద అధికారులు భారీగా మామూళ్లు తీసుకొని వాటిపై ఎలాటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెడ్డు లు, సెల్లర్ , అక్రమ అంతస్థులు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్క నోటీసు కూడా జారీ చేయడం లేదు. నిర్మాణ పనులను అడ్డుకోవడం లేదు. అదే అదునుగా నిర్మాణదారులు తాను ఇష్టం వచ్చిన రీతిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమ నిర్మాణాలు సర్కిల్ పరిధిలో జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏ సి పి గతంలో అనేక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన సంఘటనలు ఉన్నాయి. అవినీతికి మారుపేరుగా మారిన ఏసిపి పై విజిలెన్స్ విభాగం మౌనం వహించడం ఏమిటని ఆ అధికారిపై ఏసీబీ దాడులు చేస్తే ఓ పెద్ద తిమింగలం ఏసీబీ అధికారులకు దొరుకుతుందా అని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
No comments:
Post a Comment