Followers

ప్రజలే నా పంచ ప్రాణాలు

 ప్రజలే నా పంచ ప్రాణాలు

కరోనా పేషెంట్లు కోలుకునేంత వరకు అండగా ఉంటా.!

గుండె నిబ్బరం కోల్పోయిన వారికీ మనోధైర్యం అనే మందుతో బాగు చేస్తా..!

తెరాస మహిళ నేత కందుల సంధ్యారాణి



రామగుండం ,  పెన్ పవర్ 

రామగుండం నియోజకవర్గంలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అసలు ఎవరావిడా.? అనే ప్రశ్న ఎవరికి వేసిన చాలు అందరి నోట వచ్చే ఒకే ఒక్క మాట.! ఎవరైన సరే ఆకలితో ఉన్న అంటే చాలు వారికి అన్నం పెట్టే అమ్మ.! అని ఎవరైన సరే ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు మరు క్షణమే వాళ్ళ వద్దకు వెళ్ళి వారి కష్టం తీర్చే ఓ అక్క.! నియోజకవర్గ ప్రజల నోట్లో నాలికై ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే ప్రజలే తన పంచ ప్రాణాలుగా భావించి అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆది పారా శక్తే మా మహా నాయకురాలు కందుల సంధ్యారాణి అని  చెప్పే వాళ్ళు కోకొళ్ళలు.. ఇక అసలు విషయానికి వస్తే పాలకుర్తి మండలంలో గత రెండు రోజుల క్రిందటే కరోనా వైరస్ భారిన పడ్డ పేషెంట్లకి వారి ఆరోగ్యం కుదుట పడి వారు త్వరగా కోలుకోవాలని వాళ్ళ ఇంటింటి తానే స్వయంగా తిరుగుతూ వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడమే కాకుండా గుండె నిబ్బరం కోల్పోయిన వాళ్ళలో మనో ధైర్యాన్ని నింపారు. అదే విధంగా శుక్రవారం రోజున మళ్ళీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుక్కలగూడుర్ గ్రామంలో కూడ కరోనా సోకి హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా వైరస్ బాధితుల ఇంటింటికీ తిరుగుతూ వారిని పరామర్శిస్తూ గుండె నిబ్బరాన్ని కోల్పోయిన వారిలో మనోధైర్యం అనే మందుగా వాళ్ళకి కొండంత ధైర్యాన్ని నింపుతూ వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన పండ్లని డ్రై ఫ్రూట్స్ ని అందజేస్తూ మంచి పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని వారికి సలహాలు సూచనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో తన వెంట గోపు రామన్న, ఆశ్రఫ్, చెల్ల సురేష్, పత్తిపాక శంకరయ్య, ఆడెపు కిషణ్, రాజు, శ్రీనివాస్, బరుపటి నారాయణ మరియు  కర్ణ, పద్మ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...