ప్రజలకు అండగా కొక్కిరాల ట్రస్ట్
లక్షెట్టిపెట్, పెన్ పవర్కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యం సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని కాంగ్రేస్ నాయకులు అన్నారు.మండలంలో కరోన సెకండ్ వేవ్ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో శనివారం పట్టణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి యంత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల మంచి కోసమే ఆలోచిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్ని మండలాల్లో ప్రజల ఆరోగ్య దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరిఫ్,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్,కౌన్సలర్లు రందేని వెంకటేష్,చింత సువర్ణ, నాయకులు రాయలింగు, సూరం చంద్రమౌళి,వెంకటేష్,అయిల్లా విజయ్,శ్రీధర్,శ్రీలత,మల్లేష్,లక్ష్మణ్,ప్రశాంత్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment