కరోనా కట్టడికి అందరు సహకరించాలి
మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్
గంభీరావుపేట , పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో శనివారం గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ 17-4-2021 నుండి 30-4-2021వరకు మండల కేంద్రం లో ఆంక్షలు విధించారు కోవిడ్ కరోనా సెకండ్ వేవ్ విజృoబిస్తున్న సమయం లో నిర్ణయం ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్నారు. గంభీరావుపేట మండలకేంద్రం లో కోవిడ్ బాధితుల సంఖ్య వేగవంతం గా పెరుగుతుండటంతో నిర్ణయం తీసుకొన్నారు గరిష్ట సమయ పాలనను అమలులో కి తీసుకొని వచ్చారు. మండల కేంద్రం లో కిరణం షాప్ వ్యాపారస్తులు సామజిక దూరం పాటించాలని తెలిపారు. నిర్వహిస్తున్న వ్యాపార సముదాయా లు ఉదయం 8గం" నిండి 11 గం"వరకు విక్రయయించాలి. సాయంత్రం 6గం " నుండి రాత్రి 8గం" వరకు ఉంచాలి తెలిపారు. గంభీరావుపేట గాంధీ విగ్రహం వద్ద నడుపుతున్న కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా తొలగించడ మైనది దీనికి వీలుగా మండల కేంద్రం లో 4 స్థలం లో కూరగాయల మార్కెట్ల ను తాత్కాలిక పద్ధతిన ఏర్పాటు చేశారు. 1 బాలుర ఉన్నత పాఠశాల , పాత భవనం ప్రాంగణం 2, రామాలయం , 3 పాటిరాజాం విగ్రహం వద్ద , 4, దుబ్బాక పోచమ్మ వద్ద ఏర్పాటు చేశారు. అందరు మాస్క్ లు ధరించి ఒక మీటర్ దూరం ఒక్కరు కూర్చొని ఉన్నారు ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. మండల కేంద్రం లో మటన్ , చికెన్ వ్యాపారస్తులు తమ ఇంటి వద్ద చికెన్ మటన్ లను విక్రయించాలి. వీరికి బహిరంగ మార్కెట్లో అమ్మే అనుమతి లేదు. హోటల్ , టిఫిన్ సెంటర్ సిటింగ్ అనుమతి లేదు ఓన్లీ పార్సల్ మాత్రమే ఇవ్వాలి. హాస్పిటల్ , మెడికల్ పాల విక్రయ కేంద్రా లకు ఎలాంటి ఆంక్షలు లేదు యధావిధిగా నడుస్తాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి లేనిచో 1000/-రూపాయలు జరిమానా విధించారు . బీడీ కారకానా సామజిక దూరాన్ని పాటిస్తూ తమ విధులు కొనసాగించుకోవాలి. చేపలఅమ్మకాలను ఇంటి వద్దే విక్రయయించాలి. తీర్థ యాత్రలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. ఇప్పటికే ఎవరైనా తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఉంటే కోవిడ్ టెస్ట్ లు కరోనా టెస్ట్ లు చేసుకోవాలి. 45 సం"పై బడిన వారు ఎవరైనా గంభీరావుపేట సామజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కోవిడ్ వ్యాక్సిజన్, తీసుకోవాలి తెలిపారు. గంభీరావుపేట మండలం కేంద్రం లో ఎలాంటి సభలు సమావేశం కు అనుమతి లేదు తెలపడంమైనది. కరోనా కట్టడికి అందరు సహకరించాలికార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా దిశ కమిటీ డైరెక్టర్ గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ , ఉపసర్పంచ్ నాగరాజు గౌడ్ , బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్ , రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ మజార్ , ఎంపీటీసీ రాజేందర్ , టీఆరెఎస్ మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల రాజనర్సు, వై బాబు ,పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment