మేడే ను జయప్రదం చేయండి
చిత్తూరు, పెన్ పవర్
కార్మిక వర్గానికి మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు పిలుపు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ పర్మనెంట్, కాంట్రాక్ట్ ల, కమిటీ సమావేశం ఎస్ టి యు ఉపాధ్యాయుల కార్యాలయంలో దొరస్వామి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రాధాన్యత గురించి యూనియన్ ప్రధాన కార్యదర్శి యస్. విజయకుమార్ వివరించారు. సమావేశం లో ఏఐటీయూసీ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందిస్తూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల నిబంధనల వలన సమస్యలు పరిష్కారం కాలేదు ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ గారు జోక్యం చేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు 5 నెలల హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలని, పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు నూనె, సోపులు, చెప్పులు, కుట్టు కూలీ, ఇవ్వాలని, గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించని 12మందికి జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 26 తేదీ నుండి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పి ఎస్ నాగరాజు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యమూర్తి, ఏ పీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు దాసరి చంద్ర, డి హెచ్ పి ఎస్ నాయకులు రఘు, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ విజయ్ కుమార్, డి దొరస్వామి, ఏసుపాదం, రాజలక్ష్మి, విజయ, సులోచన, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, వినాయక జయశంకర్, శోభన్ బాబు, వినోద్ కుమార్ సుగుణ, చిత్ర, సుకన్య , మేస్త్రీ యూనియన్ నాయకులు నాగరాజు, చంద్ర, ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment