చెన్నూర్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టి. ప్రవీణ్ కుమార్ సి.ఐ
మంచిర్యాల , పెన్ పవర్మంచిర్యాల సర్కిల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న టి. ప్రవీణ్ కుమార్ చెన్నూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేయడంతో శుక్రవారం టి ప్రవీణ్ కుమార్ చెన్నూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. టి ప్రవీణ్ కుమార్ సిఐ మాట్లాడుతూ పట్టణం లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ప్రజలు వెంటనే సమాచారం అందించాలని కోరారు. యువత చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడవాలని ఉన్నత చదువులు, చదివి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ మొదలై నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, అదేవిధంగా మాస్కులు ధరించాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని కోరారు.
No comments:
Post a Comment