ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటలకు పాలాభిషేకం
పెన్ పవర్, గొల్లపల్లిమండల కేంద్రంలో టిఆర్ఎస్వి మండల శాఖ అధ్యక్షుడు అవారి చందు ఆధ్వర్యంలో నూతన జోనల్ వ్యవస్థను ఆమోదించినందుకు శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ వెంకటేష్ నేత చిత్రపటలకు పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంల టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి మాట్లాడుతూ భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు 7 జోను లో రెండు లతో కూడిన నూతన జోనల్ వ్యవస్థకు రాజ ముద్ర వేసిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్1 గ్రూప్ 2 ఉద్యోగాలను స్థానికులకే దక్కే విధంగా రూపకల్పన చేసి భారత ప్రభుత్వ ఆమోదానికి పంపడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి నూతన జరిగింది ఈ నూతన జోనల్ విధానం ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కుతాయి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వలన గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాలలో 50 శాతం ఓపెన్ కేటగిరి ఉండడం వలన తెలంగాణలోని ఉద్యోగాలను ఆంధ్ర నాయకులు తీసుకువెళ్లారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్న పాత్ర గొప్పదని భావించి స్థానిక యువకులకే 90 శాతం ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కొత్త చట్టం తీసుకు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి కేసీఆర్ కి మేము రుణపడి ఉంటా టిఆర్ఎస్వి అధ్యక్షుడు అవారి చందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 7 కొత్త జోన్లు 2 మల్టీ జోన్లు గా కొత్త జోన్ వ్యవస్థను రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంపీ వెంకటేష్ నేత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్ ర్ జెడ్పిటిసి గోసుల జలంధర్ పీఏసీఏస్ చైర్మన్ రాజసుమన్ రావు ఏఎంసి చైర్మన్ ముస్కు లింగారెడ్డి,పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొల్లం రమేష్,యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారంపల్లి బాబు పట్టణ అధ్యక్షుడు చౌటపల్లి తిరుపతి నాయకులు రాంచందర్ రెడ్డి గంధం మధు పుప్పాల మహిపల్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment