సోడియం హైపో క్లో్రైడ్ స్ప్రే చేసిన జిపి సిబ్బంది
ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి.
నెల్లికుదురు సర్పంచ్ బి యాదగిరి రెడ్డి
నెల్లికుదురు , పెన్ పవర్
కరోనా వైరస్ విశ్రుంకలం గా వ్యాపిస్తున్న సందర్బంగా దీని కట్టడికై మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ బీరవెళ్లి యాదగిరి రెడ్డి పర్యవేక్షణలోగ్రామ పంచాయతీ సిబ్బంది సోడియం హైపో క్లో్రైడ్ స్ప్రే చేశారు. ఇందులో భాగంగా జనసంచారం ఎక్కువగా ఉండేప్రాంతాలలో మరియు స్థానిక ఎస్బిఐ,లోపల దాని చుట్టూ పరిసర ప్రాంతంలో ఎస్ హెచ్ సి ని స్ప్రే చేశారు. ఈ సందర్బంగా నెల్లికుదురు సర్పంచ్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అత్యవసర పనులుంటేనే బయటకు మాస్క్ ధరించి రావాలని, మాస్క్ ధరించని వారికీ కచ్చితంగా జరిమానా విధిస్తామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment