అగ్నిప్రమాదాలపై అవగాహన తప్పనిసరి
అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ రావు
రామ్ దేవ్ రావు ఆసుపత్రిలో మాక్ డ్రిల్
పెద్ద ఎత్తున హాజరైన వివిధ ఆసుపత్రుల సిబ్బంది
కూకట్ పల్లి, పెన్ పవర్
కరోన విజ్రంభిస్తు ఆస్పత్రులని రోగులతో నిండిపోతున వేళా అగ్నిప్రమాదాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని కూకట్ పల్లి జోన్ అగ్నిమాపక శాఖ అధికారి సుధాకర్ రావు అన్నారు. అవగాహన తోనే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడొచ్చన్నారు. ఈ మేరకు అగ్ని ప్రమాదాల సమయంలో వాస్తవ పరిణామాలను ప్రతిబింబిస్తూ గురువారం రాందేవ్ రావు ఆసుపత్రిలో చేపట్టిన మాక్ డ్రిల్ విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. అగ్ని ప్రమాదాలు జరగడానికి గల ఆస్కారాలు, వాటి నివారణ చర్యలు, రోగులను పైఅంతస్తుల నుండి నేర్పుగా క్రిందికి దింపే ప్రక్రియలు, క్షతగాత్రులకు అందించాల్సి న తక్షణ వైద్యంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది అవగాహనతో ఉంటే మంటలు చెలరేగినప్పుడు తాము వచ్చేలోపే ప్రమాద తీవ్రతను తగ్గించగలరని పేర్కొన్నారు. రామ్ దేవ్ రావు ఆసుపత్రి ఎమ్.డి డాక్టర్ కె.కమలాకర్, సిఇఒ డాక్టర్ యోబు మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణపై తమ సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాందేవ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ ఆసుపత్రుల సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment