Followers

జిల్లా కలెక్టర్ ను కలిసిన ఉక్కు నిర్వాసితులు..

 జిల్లా కలెక్టర్ ను కలిసిన ఉక్కు నిర్వాసితులు..

విశాఖపట్నం,పెన్ పవర్

విశాఖ ఉక్కు నిర్మాణ సమయంలో భూముల ఇచ్చిన నిర్వాసితులు శనివారం విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలిసి మెమోరాండం సమర్పించారు. నిర్వాసితుల ప్రతినిధులు పులి రమణారెడ్డి, ఉమ్మిడి అప్పారావు,సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి వి లక్ష్మీ నారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి, సీపీఎం రాష్ట్ర కారదర్శి వర్గ సభ్యులు సి హేచ్ నర్సింగరావు, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, టీడీపీ కార్పోరేటర్స్ లేళ్ల కోటేశ్వరరావు,గంధం శ్రీను తదితర నాయకత్వ బృందం జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో స్వచ్చందంగా తమ భూములు ఇచ్చామని నేటికీ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సుమారు 8500 మంది నిర్వాసితులకు ఆర్ కార్డులు మంజూరు చేశారని నేటికి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడో, రేపో న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన వెలుబడడం మరింత ఆందోళనకు గురికావాల్సి వస్తోందని నిర్వాసితులు కలెక్టర్ ముందు వాపోయారు. గతంలో మేము ఇచిన్న భూములను యదతదంగా వెన్నక్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు విరమించబోమని, అవసరమైతే ప్రాణాలను సైతం విడవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టికి నిర్వాసితుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...