ప్రగతి నగర్ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్మాన్యశ్రీ స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్ బిజెపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.. మహనీయున్ని స్మరించుకోవడం మన బాధ్యత అని బాజాపా శ్రేణులు అన్నారు., స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లడమే గాక, కేంద్రలో వివిధ శాఖలకు మంత్రిగా, నూతన వ్యవసాయ చట్టాలతో ఆహారం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ,బంగ్లాదేశ్ తో యుద్ధం భారతదేశాన్ని విజయం సాధించడంతో మంత్రిగా తన చతురతను చూపించిన నాయకుడు, దళితులు విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రయత్నించాలని, ఆర్థిక స్వావలంబన సాధించిన నాడు నిజమైన దళిత ప్రజలకి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నించిన మహా నాయకులు నవజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాం పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, రాష్ట్ర మైనార్టీ మోర్చా మహిళా ప్రముఖ మల్లేశ్వరి, బీజేవైఎం జిల్లా మహిళా ఇన్చార్జ్ శాంభవి, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ ,శివ కోటేశ్వరరావు చౌదరి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment