Followers

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

 ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి

పశ్చిమ గోదావరి, పెన్ పవర్

 కార్మికులు, కర్షకులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు సూచించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ ఉత్తర్వులు మేరకు, ఏలూరు డి ఎస్ పి డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన సూచనలను, సలహాలను తెలియజేసేందుకు ఏలూరులోని మార్కెట్ యార్డ్ లో హమాలీలు, రైతులకు, ఏలూరు కొత్తూరు జూట్ మిల్ కార్మికులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను కబళించి వేస్తుందని, ఇంటి నుంచి బయటకు వచ్చేవారు కోవిడ్ నిబంధనలు పాటించక పోవడం వల్లే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కనిపించని సతృవు కరోనా వైరస్ మనపై దాడి చేస్తోందని, కరోనా వైరస్ మనకు వ్యాపించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తనకు ఏమీ కాదులే అనే ధీమాతో రోడ్లపై కొవిడ్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని, ఆ వైరస్ కుటుంబసభ్యులు కూడా వ్యాప్తి చెందే వారు అవుతారని  హెచ్చరించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై చావా సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...