వాలంటరీల సేవలకు సేవా మిత్ర అవార్డులు
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటరీలు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి వారి సేవలకు గుర్తింపుగా వాలంటరీలను సత్కరించాలని నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరిగే కార్యక్రమంలో భాగంగా ఎటపాక మండల పరిధిలోని చోడవరం గ్రామంలో గురువారం ఆ కార్యక్రమాని వైఎస్ఆర్ సీపీ ఎంపిటిసి. ఎలామూల. రమేష్ , సర్పంచ్ పొడియం. మనీ, ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించి వారి చేతుల మీదుగా ఆరుగురికి అవార్డులు పంపిణీ చేశారు.
ఇందులో భాగంగా వాలంటరీ లకు శాలువాలు కప్పి సన్మానించారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీటీసీ రమేష్ మాట్లాడుతూ... సేవా దృక్పథంతో గ్రామ ప్రజలకు సేవలు అందించే గ్రామ వాలంటరీలకు ప్రభుత్వం గుర్తించి వారికి సేవ వజ్ర, సేవా మిత్ర,అవార్డులు ఇవ్వడం అభినందనీయమని అదేవిధంగా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగాఉండాలి,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ వాడాలని,పది నిమిషాలకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కోవాలని,భౌతిక దూరం పాటించాలని,అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్ళవద్దని, కరోనాని తరిమి కొట్టాలంటే మనం ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన అంశాలనిఅన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి. మౌనిక, రెవిన్యూ సిబ్బంది వి ఆర్ ఓ. వెంకన్న, ఉప సర్పంచ్ విజయ్, వాలంటరీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment